సంగారెడ్డి, 2026-06-30
శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని, సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా జూలై 1వ తేదీ నుండి 31 వరకు నెల రోజుల పాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్–1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున సంగారెడ్డి జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఎస్పీ స్పష్టం చేశారు.
శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని, సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా జూలై 1వ తేదీ నుండి 31 వరకు నెల రోజుల పాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్–1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున సంగారెడ్డి జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఎస్పీ స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా, ప్రజాధనానికి నష్టం కలిగించే ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేపట్టకూడదని హెచ్చరించారు. ఈ విషయంలో జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించవలసిందిగా ఎస్పీ సూచించారు. అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టరిత్య కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.












