కామారెడ్డి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుందం రెడ్డిని మాదిగ రాజకీయ పోరాట సమితి (ఎంఆర్పీఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్. బాగయ్య మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఆర్. బాగయ్య మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తున్న ముకుందం రెడ్డి సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.
సమాజ సంక్షేమం కోసం ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేయడం వల్ల ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం టౌన్ అధ్యక్షుడు పత్తిరి శివరాజు, ఎంఆర్పీఎస్ నాయకులు ఈ రొల్ల బాలరాజు, కొత్తూరు గంగయ్య తదితరులు పాల్గొని ఎక్సైజ్ సూపరింటెండెంట్‌ను అభినందించారు.












