అందోల్, జూన్ 30
అందోల్-జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో ప్రత్యేక ఓటరు జాబితా (Special Summary Revision) కార్యక్రమం ప్రారంభమైంది. బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) స్వరూప ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలిస్తున్నారు.
అందోల్-జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో ప్రత్యేక ఓటరు జాబితా (Special Summary Revision) కార్యక్రమం ప్రారంభమైంది. బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) స్వరూప ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ఇంటి నంబర్ ఆధారంగా ఓటు హక్కు కలిగిన వారి వివరాలను నమోదు చేయడంతో పాటు, కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పులు, పేర్ల సవరణలు, మరణించిన వారి పేర్ల తొలగింపు, డబుల్ ఓట్ల గుర్తింపు వంటి ప్రక్రియను చేపడుతున్నారు.
2002 నాటికి ఓటు హక్కు అర్హత పొందిన వారు తప్పనిసరిగా సంబంధిత దరఖాస్తు ఫారాలను నింపాలని, కొత్తగా ఓటు హక్కు పొందిన యువత కూడా కొత్తగా నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎస్.కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్, 15వ వార్డు కౌన్సిలర్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు), మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు జీషన్, ఆత్మ కమిటీ డైరెక్టర్, 15వ వార్డు బీఎల్ఏ ఎండీ ఖాలేద్, బీఎల్ఓ స్వరూపతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.










