కామారెడ్డి, 29.06.2026
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజల నుంచి వివిధ శాఖలకు సంబంధించిన మొత్తం 101 దరఖాస్తులను స్వీకరించారు. కామారెడ్డి జిల్లాలో సోమవారం ఈ కార్యక్రమం జరిగింది. భూ సమస్యలు, విద్య, రెవెన్యూ, పింఛన్లు, సంక్షేమ పథకాలకు సంబంధించిన వినతులు సమర్పించారు.
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజల నుంచి వివిధ శాఖలకు సంబంధించిన మొత్తం 101 దరఖాస్తులను స్వీకరించారు. కామారెడ్డి జిల్లాలో సోమవారం ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా భూ సమస్యలు, విద్యాశాఖ, రెవెన్యూ, పింఛన్లు, సంక్షేమ పథకాలు, గృహాలు, ఉపాధి, విద్యుత్, మున్సిపల్, వ్యవసాయం, సదరం క్యాంపులు వంటి వివిధ శాఖలకు సంబంధించిన వినతులను ప్రజలు సమర్పించారు.
ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, ప్రభుత్వ నిబంధనల మేరకు సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, NV గిరి, జడ్పీ సీఈఓ చందర్, జిల్లా స్థాయి అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.












