సంగారెడ్డి, జూన్ 29
ప్రజలసమస్యలపరిష్కారానికిప్రతిసోమవారంజరిగేప్రజావాణికార్యక్రమానికిజిల్లాఅధికారులుతప్పనిసరిగాహాజరుకావాలనిజిల్లా జిల్లా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ఆదేశించారు. గైర్హాజరైన పలువురు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సూచించారు. ప్రజావాణి ప్రాధాన్యతను గుర్తించాలని అధికారులకు సూచించారు.
ప్రజల సమస్యలను సత్వరంగా పరిష్కరించేందుకు ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ స్పష్టం చేశారు. ముందస్తు సమాచారం లేకుండా గైర్హాజరయ్యే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాండు, ఆర్డీఓ రాజేందర్‌తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అందిన అర్జీలను పరిశీలించి, వాటి సత్వర పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు పంపించారు.
ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులు హాజరు వివరాలను శాఖల వారీగా పరిశీలించిన కలెక్టర్, ముందస్తు సమాచారం ఇవ్వకుండా పలువురు అధికారులు గైర్హాజరైనట్లు గుర్తించి అసంతృప్తి వ్యక్తం చేశారు. గైర్హాజరైన అధికారులకు షోకాజ్ మెమోలు జారీ చేసి సంజాయిషీ కోరాలని ఆదేశించారు. ఇకపై ప్రజావాణికి గైర్హాజరయ్యే అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రజావాణి కార్యక్రమం ప్రజలకు అత్యంత ముఖ్యమైన వేదిక అని, అధికారులు దాని ప్రాధాన్యతను గుర్తించి విధిగా హాజరుకావాలని సూచించారు. ప్రజల నుంచి అందిన ప్రతి వినతిని అంకితభావంతో పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా వ్యాప్తంగా ప్రజావాణికి మొత్తం 75 వినతులు అందాయి. వాటిలో కలెక్టరేట్ ప్రజావాణికి 37, సంగారెడ్డి డివిజన్‌కు 19, నారాయణఖేడ్ డివిజన్‌కు 9, జహీరాబాద్ డివిజన్‌కు 8, ఆందోల్ డివిజన్‌కు 2 వినతులు అందినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, రెవెన్యూ అధికారులు, గురుకుల కోఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు.










