పటాన్చెరు, జూలై 22
పటాన్చెరు పోలీస్ స్టేషన్ నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన రవీందర్‌ను ఇంద్రేశం మున్సిపాలిటీ 14వ వార్డు కౌన్సిలర్ రాచమల్ల శ్రీనివాస్ గౌడ్ ఘనంగా సన్మానించారు. బుధవారం సీఐ కార్యాలయంలో ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.
పటాన్చెరు పోలీస్ స్టేషన్ నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన రవీందర్‌ను ఇంద్రేశం మున్సిపాలిటీ 14వ వార్డు కౌన్సిలర్ రాచమల్ల శ్రీనివాస్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. బుధవారం పటాన్చెరు సీఐ కార్యాలయంలో ఆయనకు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్థవంతమైన పోలీసు సేవలు అందించాలని ఆకాంక్షించారు. పటాన్చెరు ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల సమస్యల పరిష్కారంలో పోలీసు శాఖ మరింత చురుకుగా పని చేయాలని కోరారు.
సీఐ రవీందర్ మాట్లాడుతూ పోలీసు–ప్రజల మధ్య సత్సంబంధాలు బలోపేతం కావడానికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని పేర్కొన్నారు.











