నారాయణఖేడ్, జూలై 22
నారాయణఖేడ్ తాలూకా తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ (టీఎన్జీవోస్) నూతన కార్యవర్గ ఎన్నికలు బుధవారం జిల్లా అధ్యక్షుడు ఎం.డి. జావీద్ అలీ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో ఎం.డి. మిస్కిన్ అధ్యక్షుడిగా, పి.దత్తు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు కసిని శ్రీకాంత్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.
నారాయణఖేడ్ తాలూకా తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ (టీఎన్జీవోస్) నూతన కార్యవర్గ ఎన్నికలు బుధవారం జిల్లా అధ్యక్షుడు ఎం.డి. జావీద్ అలీ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా జరిగాయి. ఎన్నికల ప్రక్రియను జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు కసిని శ్రీకాంత్ ఎన్నికల అధికారిగా వ్యవహరించి విజయవంతంగా నిర్వహించారు.
ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎం.డి. మిస్కిన్, ప్రధాన కార్యదర్శిగా పి.దత్తు, అసోసియేట్ కార్యదర్శిగా కె. రవీందర్, ట్రెజరర్‌గా భాస్కర్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా సంతోష్ కుమార్, రజిత, సాయన్న, జాయింట్ సెక్రటరీలుగా అరుణ్, విట్టవ్వ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ముజమ్మిల్, పబ్లిసిటీ సెక్రటరీగా రుక్మారెడ్డి ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా నాగలక్ష్మి, లక్ష్మణ్ కుమార్, పండరీ, సూర్యకాంత్, ప్రవీణ్, రాజు నాయక్‌లు ఎంపికయ్యారు.
ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి వి. రవి, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, జిల్లా ట్రెజరర్ శ్రీనివాస్‌తో పాటు వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఎం.డి. జావీద్ అలీ మాట్లాడుతూ, ఉద్యోగులు తమ విధులను నిబద్ధతతో నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, అదే సమయంలో తమ హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా పనిచేయాలని సూచించారు. యూనియన్ బలోపేతానికి ప్రతి సభ్యుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
నూతన అధ్యక్షుడు ఎం.డి. మిస్కిన్ మాట్లాడుతూ, ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సేవా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ ప్రతి ఉద్యోగిని కలుపుకొని యూనియన్ను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. నూతన కార్యవర్గం ఉద్యోగుల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.











