సంగారెడ్డి, July 22
సంగారెడ్డి బైపాస్ మున్సిపల్ పార్కులో రోటరీ క్లబ్ ఆఫ్ మంజీరా ఆధ్వర్యంలో సుమారు 150 మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ జి అంజయ్య నొక్కి చెప్పారు. రోటరీ క్లబ్ అందిస్తున్న సేవల గురించి అధ్యక్షుడు సి.హెచ్.అంజయ్య వివరించారు.
సంగారెడ్డి బైపాస్ మున్సిపల్ పార్కులో రోటరీ క్లబ్ ఆఫ్ మంజీరా ఆధ్వర్యంలో సుమారు 150 మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా గ్రంథాలయ చైర్మన్ జి అంజయ్య తెలిపారు. పేద ప్రజలకు అందిస్తున్న సేవలను రోటరీ క్లబ్ అధ్యక్షుడు సి.హెచ్.అంజయ్య వివరించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత మండల విద్యాధికారి డి.అంజయ్య, దినేష్, శ్రీనివాస్, భూమయ్య, విజయభాస్కర్, దశరత్, పండు సేట్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.












