సంగారెడ్డి, జూలై 9
ప్రజాస్వామ్యవ్యవస్థకుజర్నలిజంనాలుగోస్తంభమని,వార్తలప్రసారంలోవేగంఎంతఅవసరమోవిశ్వసనీయతఅంతకంటేముఖ్యమనిరాష్ట్రవైద్య,ఆరోగ్యశాఖమంత్రి మంత్రి దామోదరరాజనర్సింహఅన్నారు.సంగారెడ్డిలోనిటీఎన్జీవోభవన్లోతెలంగాణవర్కింగ్జర్నలిస్టులయూనియన్(TUWJ–IJU)సంగారెడ్డిజిల్లామహాసభలోఆయనఈవ్యాఖ్యలుచేశారు.
ప్రజాస్వామ్య వ్యవస్థకు జర్నలిజం నాలుగో స్తంభమని, వార్తల ప్రసారంలో వేగం ఎంత అవసరమో విశ్వసనీయత అంతకంటే ముఖ్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం సంగారెడ్డిలోని టీఎన్జీవో భవన్లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (TUWJ–IJU) సంగారెడ్డి జిల్లా మహాసభ జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి అధ్యక్షతన నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ, సంగారెడ్డి వేదికగా జర్నలిస్టుల మహాసభ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. జర్నలిస్టులు ప్రజల గొంతుకగా, సమాజానికి దిశానిర్దేశం చేసే శక్తిగా బాధ్యతాయుత పాత్ర పోషిస్తున్నారని మంత్రి కొనియాడారు. వేగవంతమైన సమాచార ప్రసారంతో పాటు వార్తలలో వాస్తవికత, విశ్వసనీయత, నైతిక విలువలు పాటించడం జర్నలిజం యొక్క ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు.
జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న హెల్త్ కార్డుల సమస్యను ప్రభుత్వం సమీక్షిస్తోందని, త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకొని సమస్యను పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు.
అనంతరం మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ జర్నలిస్టులకు గతంలో రైల్వే రాయితీపై ప్రయాణ సౌకర్యాన్ని ఉనరుద్దరించేలా త్వరలో జరుగబోయే పార్లమెంట్ సమావేశాల్లో చర్చిస్తానని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ మాట్లాడుతూ జర్నలిస్టులు వృత్తిపరమైన ఒత్తిడితో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు అందువల్ల త్వరగా హెల్త్ కార్డు లను మంజూరు చేయాలని మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఫైసల్ అహ్మద్ ప్రధాన కార్యదర్శి విష్ణు ప్రసాద్, మాజీ అధ్యక్షుడు మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












