కామారెడ్డి, 2026-07-09
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 8వ వార్డు GR కాలనీలో మామిండ్ల రాజుకు చెందిన త్రినేత్ర టీ పాయింట్, బేకరీని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా హోటల్ యజమాని మామిండ్ల రాజు మాట్లాడుతూ, స్వచ్ఛమైన పాలతో టీ పాయింట్ ప్రారంభించుకోవడం జరిగిందని, ప్రజలు ఆస్వాదించాలని కోరారు.
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 8వ వార్డు GR కాలనీలో మామిండ్ల రాజుకు చెందిన త్రినేత్ర టీ పాయింట్, బేకరీని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా హోటల్ యజమాని మామిండ్ల రాజు మాట్లాడుతూ, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.
తాను గతంలో స్వచ్ఛమైన పాలు సరఫరా చేసేవాడినని, ఇప్పుడు అదే స్వచ్ఛమైన పాలతో టీ పాయింట్‌ను ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు. కామారెడ్డి పట్టణ ప్రజలు, చుట్టుపక్కల ప్రజలు స్వచ్ఛమైన పాలతో తయారు చేసే టీని ఆస్వాదించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నీలం చిన్నరాజులు, పైడి సాయి కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు బాలకిషన్‌లకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.












