Ananthapuramu/Anantapur (ప్రశ్న ఆయుధం) జూలై 09
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR-2026) కార్యక్రమంపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జిల్లా నాయకులతో కామారెడ్డి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహిస్తున్నామని, డిజిటలైజేషన్ వేగవంతంగా కొనసాగుతోందని కలెక్టర్ తెలిపారు.
ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR-2026) కార్యక్రమంపై గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల జిల్లా నాయకులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో SIR-2026 ప్రక్రియను పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయిందని, ప్రస్తుతం వాటి డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోందని వివరించారు.
రాజకీయ పార్టీల నాయకులు తమ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు (BLAs) ద్వారా ప్రజలకు SIR ప్రక్రియపై విస్తృత అవగాహన కల్పించాలని, అలాగే బూత్ లెవల్ అధికారులు (BLOలు) క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే (House-to-House Survey) విజయవంతంగా జరిగేలా పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ కోరారు.
సమావేశంలో పాల్గొన్న రాజకీయ పార్టీల ప్రతినిధులు SIR ప్రక్రియలో భాగంగా జరుగుతున్న ఇంటింటి సర్వే గడువును పొడిగించాలని, అలాగే కామారెడ్డి పట్టణంలోని పోలింగ్ స్టేషన్లను హేతుబద్ధీకరించాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సమావేశంలో శ్రీ వి. విక్టర్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ), శ్రీ ఎన్.వై. గిరి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), కామారెడ్డి తహశీల్దార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (బీజేపీ), బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), సీపీఎం, టీడీపీ, బీఎస్పీ తదితర రాజకీయ పార్టీల జిల్లా నాయకులు సమావేశంలో పాల్గొన్నారు.












