కామారెడ్డి, 09 జూలై 2026
రాష్ట్ర ప్రభుత్వం భూముల రీ సర్వేను ఆధునిక సాంకేతికతతో పారదర్శకంగా నిర్వహించి, ప్రతి భూమికి స్పష్టమైన యాజమాన్య హక్కులు కల్పించాలని రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. భూముల రీ సర్వే, నక్ష భూములపై జిల్లా కలెక్టర్లతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.
భూముల రీ సర్వేను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత పారదర్శకంగా నిర్వహించి ప్రతి భూమికి స్పష్టమైన యాజమాన్య హక్కులు కల్పించాలని రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.
భూముల రీ సర్వే, నక్ష భూముల అంశాలపై రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్, ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కామారెడ్డి కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అడిషనల్ కలెక్టర్ విక్టర్, ఏడి ల్యాండ్ సర్వే శ్రీనివాస్ ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం భూముల రీ సర్వేను దశలవారీగా చేపడుతోందని తెలిపారు. తొలి దశలో ప్రతి జిల్లాలో 70 గ్రామాల్లో రీ సర్వే నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సర్వేతో ప్రతి సర్వే నంబర్‌కు స్పష్టమైన యాజమాన్య హక్కులు నిర్ధారించడంతో పాటు ప్రతి భూమికి ప్రత్యేక భూధార్ యూనిక్ నంబర్ కేటాయించనున్నట్లు తెలిపారు.
డీజీపీఎస్ (DGPS), రోవర్స్, జీఐఎస్ (GIS) వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రీ సర్వే చేపట్టాలని ఆదేశించారు. రీ సర్వే జరుగుతున్న ప్రతి గ్రామంలో గ్రామసభలు నిర్వహించి ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని, ఆయా గ్రామసభల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులను భాగస్వాములను చేయాలని సూచించారు.
రీ సర్వేలో రెగ్యులర్ సర్వేయర్లతో పాటు లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. సోమవారం నుంచి సర్వేయర్లు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బందికి బ్యాచ్‌ల వారీగా సమగ్ర శిక్షణ నిర్వహించి అనంతరం అన్ని గ్రామాల్లో రీ సర్వే కార్యక్రమాలు ప్రారంభించాలని ఆదేశించారు.
CCLA హైదరాబాద్ ఆదేశాల మేరకు జిల్లాలో జరుగుతున్న రీసర్వే పనులను వేగవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పలు కీలక సూచనలు చేశారు. డైలీ ప్రోగ్రెస్ రిపోర్టు రీసర్వే పనుల పురోగతిని ప్రతిరోజు స్ప్రెడ్ షీట్ రూపంలో సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పనుల పురోగతిని క్షుణ్ణంగా పర్యవేక్షించాలని సూచించారు.












