భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని మసీద్‌బండ గ్రామంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం వంటి విలువలను అంబేద్కర్ అందించారని పలువురు వక్తలు కొనియాడారు.
మసీద్‌బండ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో, అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, అంబేద్కర్ పీడిత, అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగు నింపిన మహానేత అని అన్నారు. ఆయన అందించిన సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం భారత సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.
రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ కృషి అపారమని, భారత ప్రజాస్వామ్యానికి ఆయన పునాది వేశారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో వర్గీకరణ ప్రక్రియ వేగవంతమైందని, దీని ద్వారా అన్ని వర్గాలకు సమాన హక్కులు, అవకాశాలు లభిస్తాయని చెప్పారు.
దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సభాపతి పదవిని దళిత వర్గానికి కేటాయించడం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధికి నిదర్శనమని అనిల్ కుమార్ యాదవ్ గుర్తుచేశారు. 42 శాతం రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం పొందినట్లు ఆయన వివరించారు.
విద్య, హక్కులు, అవకాశాల్లో సమానత్వం సాధించడమే అంబేద్కర్ కి నిజమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక డీఎస్పీ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రదీప్, సబ్ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, టీపీసీసీ కార్యదర్శి సామల్ కార్తీక్, మారబోయిన మహేష్ కుమార్ యాదవ్, డివిజన్ సెక్రటరీ ఎండి అజామ్, ఐవైసీ డివిజన్ అధ్యక్షుడు కోడిచర్ల మహేందర్, గోపాల్, ఎండి ఇమ్రాన్, నాగరాజ్, విజయ్, ఆకాష్, రోహిత్ గౌడ్, లావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.











