సంగారెడ్డి, జూలై 10
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఓటర్లకు పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను పూరించి వీలైనంత త్వరగా సంబంధిత బూత్ లెవల్ అధికారులకు (బీఎల్ఓలు) అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఫారాల వివరాలను నిర్దేశిత గడువులోగా డిజిటలైజ్ చేయాల్సి ఉన్నందున ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ డా.పవన్ కుమార్ శర్మ న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి, రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లతో ఎస్ఐఆర్ అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా ఇప్పటి వరకు సాధించిన పురోగతిని తెలుసుకొని, గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎస్ ఐఆర్ ప్రక్రియ పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ, వాటి వివరాల డిజిటలైజేషన్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న ఏఈఆర్వోలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో పురోగతి చూపని అధికారులపై ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా తీసుకోరాదని, ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పని చేయాలని స్పష్టం చేశారు.
గడువు సమీపిస్తున్న నేపథ్యంలో శని, ఆదివారాలు కూడా ప్రత్యేకంగా పనిచేసి, వచ్చే సోమవారం నాటికి 50 శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ సంగీత, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి, రెవెన్యూ డివిజనల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.