గుమ్మడిదల, జూలై 10
గుమ్మడిదల మండలంలోని కొత్తపల్లి గ్రామంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ (Sir) కార్యక్రమాన్ని ఆత్మ కమిటీ చైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఓటరు జాబితా పారదర్శకంగా రూపొందడంలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. అర్హులైన ఓటర్లు తమ వివరాలను సరిచూసుకుని, అవసరమైన మార్పుల కోసం గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
గుమ్మడిదల మండలంలోని కొత్తపల్లి గ్రామంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ (Sir) కార్యక్రమాన్ని ఆత్మ కమిటీ చైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. గ్రామంలో బూత్ లెవల్ అధికారి (బీఎల్వో) ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎస్ఐఆర్ ఫారాలను పంపిణీ చేస్తూ, వాటిని నింపే విధానంపై అవగాహన కల్పిస్తున్న తీరును ఆయన పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఓటరు జాబితా పారదర్శకంగా, తప్పులు లేకుండా రూపొందేందుకు ఎస్ఐఆర్ ప్రక్రియ ఎంతో కీలకమని అన్నారు. అర్హులైన ప్రతి ఓటరు తమ వివరాలను సరిచూసుకుని, అవసరమైన మార్పులు, చేర్పులు, తొలగింపుల కోసం నిర్ణీత గడువులోపు ఫారాలను సమర్పించాలని సూచించారు. బీఎల్వోలు ప్రజలకు పూర్తిస్థాయిలో సహకరించాలని, గ్రామస్తులు కూడా అధికారులకు సహకరించి ఓటరు జాబితాను కచ్చితంగా రూపొందించేందుకు భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో బీఎల్ వో శోభ, బీఎల్ ఏలు విజయ్ కుమార్, రమేష్, గ్రామస్తులు చాకలి చంద్రయ్య, ఆగం వెంకటస్వామి, కుమ్మరి వీరస్వామి, ఆగం మల్లేశం, గడ్డమీది వీరమని, పాలాటి అనసూయ, కుమ్మరి నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.











