కామారెడ్డి, 2026-07-09
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల నూతన ఎస్సైగా టి. మురళి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను జర్నలిస్ట్ గైని శ్రీకాంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో ఉత్తమ సేవలందించిన ఆయన, ఇకపై రామారెడ్డి ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల నూతన ఎస్సైగా టి. మురళి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను జర్నలిస్ట్ గైని శ్రీకాంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో తాడ్వాయి, దోమకొండ, కామారెడ్డి పోలీస్ స్టేషన్లలో ఉత్తమ సేవలందించి, ప్రజల ప్రశంసలు పొందిన టి. మురళి బదిలీపై రామారెడ్డి పోలీస్ స్టేషన్కు వచ్చారు.
ఈ సందర్భంగా నూతన ఎస్సై టి. మురళి మాట్లాడుతూ, రామారెడ్డి మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. రాజీ మార్గమే సరైన మార్గమని ఆయన మండల ప్రజలకు సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని అన్నారు.












