సంగారెడ్డి, జూలై 21
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.
ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎస్ఐఆర్ కార్యక్రమం పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ, ఎలక్ట్రోరల్ రోల్‌ను ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా పారదర్శకంగా రూపొందించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే భారత ఎన్నికల సంఘం లక్ష్యమని తెలిపారు. ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నందున, నిర్ణీత గడువులోగా అన్ని ప్రక్రియలను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ జిల్లాలో ఎస్ఐఆర్ పురోగతిని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వివరించారు. అన్ని నియోజకవర్గాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా పటాన్చెరు నియోజకవర్గంలో వార్డు అధికారులు, ఇతర వాలంటీర్ల సహకారంతో ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.












