సంగారెడ్డి, జూలై 21
తారా ప్రభుత్వ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను అతిథి అధ్యాపకుల పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.ప్రవీణ తెలిపారు. పలు విభాగాలలో ఖాళీలు ఉన్నాయని, అర్హులైన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాల విద్య ఆదేశాలకు అనుగుణంగా 2026-27 విద్యా సంవత్సరానికి గాను తారా ప్రభుత్వ కళాశాలలో అతిథి అధ్యాపకులుగా పనిచేయుటకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.ప్రవీణ తెలిపారు.
తారా ప్రభుత్వ కళాశాలలో అతిథి అధ్యాపకులుగా పనిచేయుటకు ఇంగ్లీషు -3, తెలుగు-2, బి.బి.ఏ-2, బి.బి.ఏ. రిటైలింగ్- 1, బి.కామ్ BFSI -1, బి.కామ్ HR -1, బి.సి.ఏ.- 2, కెమిస్ట్రీ-1, ఫార్మా -1, ఎకనామిక్స్ -1, హిస్టరీ-1, పొలిటికల్ సైన్స్ -1, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ -1, కంప్యూటర్ సైన్స్ మరియు అప్లికేషన్స్ -4, డేటా సైన్స్ -1, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ -1 విభాగాలలో ఖాళీలు ఉన్నాయని, వాటికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఆమె తెలిపారు.
ఈ పోస్టులకు పీ.జీ. తో పాటు నెట్ /సెట్/ పీహెచ్డీ వంటి ఉన్నత విద్యార్హతలు కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుందని ఆమె తెలిపారు. అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారాలను సంబంధిత విద్యార్హతలు, బోధన అనుభవ ధృవపత్రాలతో పాటు తారా కళాశాలలో 23-7-2025 సాయంత్రం 4 గంటలలోపు సమర్పించాలని సూచించారు.
దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులు 24-7-2025 తేదీన తారా ప్రభుత్వ కళాశాలలో ఉదయం 10 గంటల నుండి ఇంటర్వ్యూ మరియు డెమోకు హాజరుకావాలని తెలిపారు. అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఒక జిరాక్స్ సెట్ ను తీసుకొని కళాశాలలో 23-7-2025 సాయంత్రం 4 గంటలలోపు సమర్పించాలని సూచించారు.











