నిజామాబాద్, జూలై 21
ఆర్మూర్ పట్టణంలోని నారాయణ పాఠశాలలో విద్యార్థి క్యాబినెట్ ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ రజని కుమారి మాట్లాడుతూ, విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య ఎన్నికల విధానంపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
ఆర్మూర్ పట్టణంలోని నారాయణ పాఠశాలలో విద్యార్థి క్యాబినెట్ ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ రజని కుమారి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం క్యాబినెట్ ఎన్నికలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందడంతో పాటు ప్రజాస్వామ్య ఎన్నికల విధానంపై అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జీఎం గోపాల్‌రెడ్డి, డీజీఎం రమణరెడ్డి, ఏజీఎం శివాజీ హాజరయ్యారు. శివాజీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, మంచి నాయకుడికి ఉండాల్సిన లక్షణాలను వివరించారు. ఎన్నికల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థిని అభినందిస్తూ, విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.
క్యాబినెట్ ఎన్నికల్లో హెడ్ బాయ్‌గా 9వ తరగతి విద్యార్థి డి. సుకుమార్, హెడ్ గర్ల్‌గా పి. సహస్ర, డిప్యూటీ హెడ్ బాయ్‌గా రాహుల్, డిప్యూటీ హెడ్ గర్ల్‌గా మాల్యాద, జూనియర్ హెడ్ బాయ్‌గా రాజ్ ప్రణవ్, జూనియర్ హెడ్ గర్ల్‌గా దీక్షిత ఎన్నికయ్యారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వారిలోని ప్రతిభ, నాయకత్వ సామర్థ్యాలను వెలికితీసేందుకు నారాయణ విద్యాసంస్థలు ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో విజేతల తల్లిదండ్రులు పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు. పాఠశాల జెడ్సీఓ రాకేష్, ఏఓ నవీన్, ఎన్నికల ఇన్చార్జి రాజేశ్వర్, డీన్ సంతోష్, వ్యాయామ ఉపాధ్యాయులు మోహన్, మీనా తదితరులు పాల్గొన్నారు.











