సంగారెడ్డి, జూలై 4
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 75వ వర్ధంతిని పురస్కరించుకొని సంగారెడ్డిలో ఘనంగా నివాళులర్పించారు. అర్పించిన కలెక్టర్ , టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య వర్ధంతిని పురస్కరించుకొని సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ, దొడ్డి కొమరయ్య తెలంగాణ రైతాంగ ఉద్యమ చరిత్రలో చెరగని ముద్ర వేసిన మహనీయుడని కొనియాడారు. ఆయన త్యాగం, ధైర్యసాహసాలు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి జగదీష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, వివిధ కుల సంఘాల నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొని దొడ్డి కొమరయ్యకు ఘనంగా నివాళులర్పించారు.












