రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావు అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా శేర్లింగంపల్లిలోని మహాంకాళి నగర్ చౌరస్తా వద్ద ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. పలువురు రాజకీయ నాయకులు, స్థానిక ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ కు నివాళులర్పించారు.
దేశానికి రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని, మహాంకాళి నగర్ చౌరస్తా వద్ద ఆయన విగ్రహానికి స్థానిక నాయకులు, ప్రజలు పుష్పమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయాలు, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శేరిలింగంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ, అంబేద్కర్ సిద్ధాంతాలను ఆచరణలో పెట్టాలని, సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కంటెస్టెడ్ కార్పొరేటర్ నర్సింగ్ యాదవ్ మాట్లాడుతూ, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన చూపిన మార్గం ఎప్పటికీ ప్రాసంగికమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కేశవ్, రంగారెడ్డి అర్బన్ జిల్లా ఉపాధ్యక్షురాలు స్రవంతి, జిల్లా కార్యదర్శి దుర్గాప్రసాద్, మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు రామరాజు, సీనియర్ నాయకులు వెంకటస్వామి రెడ్డి, నరసింహాచారి, ఆంజనేయులు యాదవ్ తో పాటు స్థానిక యువకులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.











