సంగారెడ్డి, జూలై 8
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో ఎంపీడీవోల పాత్ర అత్యంత కీలకమని, ప్రతి పనిని నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుండి వీసీ ద్వారా వివిధ అభివృద్ధి పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో ఎంపీడీవోల పాత్ర అత్యంత కీలకమని, ప్రతి పనిని నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఏపీఎంలు, ఏపీఓలు, ఎంపీఓలు, డీపీఎంలు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులతో కలెక్టరేట్ నుండి వీసీ ద్వారా వివో భవనాలు, గ్రామపంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాల నిర్మాణాలు, పాఠశాల మరుగుదొడ్లు, కమ్యూనిటీ సోక్ పిట్స్, వ్యక్తిగత గృహ మరుగుదొడ్లు (IHHLs), ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, రైన్వాటర్ హార్వెస్టింగ్ తదితర అంశాలపై మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పేదల సొంతింటి కలను నెరవేర్చే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి నిర్ణీత లక్ష్యాలను సాధించాలని అధికారులకు సూచించారు. వ్యక్తిగత గృహ మరుగుదొడ్ల నిర్మాణంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ఎస్టిమేషన్ జనరేట్ చేయాలన్నారు.
అలాగే వివో భవనాలు, గ్రామపంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణాలను వేగవంతం చేసి, నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. కమ్యూనిటీ సోక్ పిట్స్, రైన్వాటర్ హార్వెస్టింగ్ వంటి పనులను కూడా వేగవంతం చేసి గ్రామాల్లో పారిశుద్ధ్యం, భూగర్భ జలాల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ప్రభుత్వ విద్యాసంస్థలను ప్రతి వారం కనీసం రెండుసార్లు తప్పనిసరిగా సందర్శించాలని ఆదేశించారు. పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం, రూఫ్ లీకేజీలు, మరుగుదొడ్లు, స్టోరేజ్ రూములు, విద్యుత్ సౌకర్యాలు తదితర మౌలిక వసతులను పరిశీలించి లోపాలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ పాండు, డీఆర్డీఓ జ్యోతి, జెడ్పీ సీఈవో జానకి రెడ్డి, డీపీఓ మల్లారెడ్డి, అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బాలరాజ్, రెవెన్యూ డివిజనల్ అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.










