సంగారెడ్డి, జూలై 13
ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో అదనపు జిల్లా చైతన్య రెడ్డి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. బాధితుల సమస్యలను ఓపికగా విని, అధికారులకు తగిన సూచనలు అందించారు.
జిల్లా ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో సోమవారం అదనపు జిల్లా చైతన్య రెడ్డి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్భంగా ఫిర్యాదుదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను ఓపికగా విని, సంబంధిత ఎస్.హెచ్.ఓలతో ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ, మీ సమస్యలకు స్థానిక పోలీస్ స్టేషన్లలో పరిష్కారం దొరకనప్పుడు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా, మద్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి సేవలు వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు.
ప్రజావాణి ద్వారా అందిన ప్రతి ఫిర్యాదులపై జిల్లా పోలీసు కార్యాలయం నుండి ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతుందని, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అదనపు ఎస్పీ తెలిపారు. ప్రజలకు త్వరితగతిన, పారదర్శకంగా న్యాయం అందించడమే సంగారెడ్డి జిల్లా పోలీసు శాఖ లక్ష్యమని అన్నారు.











