కామారెడ్డి, జూలై 13
కామారెడ్డి జిల్లాలో యువతను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించేందుకు దేవునపల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో సోమవారం కళాశాల మైదానంలో ఒక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా దేవునపల్లి హెడ్ కానిస్టేబుల్ రమేష్ మాట్లాడుతూ, సైబర్ నేరగాళ్లు చేసే మోసపూరిత కాల్స్, పంపే లింకులు, నకిలీ పెట్టుబడి ఆఫర్ల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తమ వ్యక్తిగత బ్యాంకు వివరాలు, ఓటీపీలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించారు.
అలాగే, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, మత్తు పదార్థాల వాడకం వల్ల వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించారు. విద్యార్థులు, యువత చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని, అనుమానాస్పద ఘటనలు లేదా సైబర్ మోసాలు జరిగినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ కానిస్టేబుళ్లు రమేష్, రవికుమార్, జైపాల్, మహేందర్, భూపతి తదితరులు పాల్గొన్నారు. కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై అవగాహన కార్యక్రమాన్ని ఆసక్తిగా వీక్షించారు.