సంగారెడ్డి, జూలై 13
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హులైన వారికి వేగంగా పరిష్కారాలు చూపాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను అదనపు కలెక్టర్లు సంగీత, పాండులతో కలిసి స్వీకరించారు.
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి, అర్హత మేరకు వేగవంతంగా పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్లు సంగీత, పాండులతో కలిసి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రతి దరఖాస్తును పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి ద్వారా ప్రజలు ప్రభుత్వంపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా ప్రతి ఫిర్యాదుకు సత్వర పరిష్కారం అందించాలని తెలిపారు.
ప్రజావాణిలో జిల్లా వ్యాప్తంగా మొత్తం 50 వినతులు అందినట్లు అధికారులు తెలిపారు. వాటిలో సంగారెడ్డి డివిజన్‌కు 16, నారాయణఖేడ్ డివిజన్‌కు 4, జహీరాబాద్ డివిజన్‌కు 6, కలెక్టరేట్‌కు 24 దరఖాస్తులు అందగా, అందోల్ డివిజన్‌కు ఎలాంటి వినతులు అందలేదని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, సంగారెడ్డి ఆర్డీవో, సంబంధిత అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.











