కామారెడ్డి, జూన్ 25
కమెడడిజిలలమధయనిషేధమియఅబకీశఖలకొజిలలమధయనిషేధమియఅబకీఅధికిబి.మకదెడడిబధయలసీకిచ.ఇకమదఅసిసటెటఎకసైజసూపిటెడెటపనిచేసినబి.హనమమలకజిిజిలలకబదిలీఅయయ.
కామారెడ్డి జిల్లా మధ్యనిషేధ మరియు అబ్కారీ శాఖలో కొత్త జిల్లా మధ్యనిషేధ మరియు అబ్కారీ అధికారిగా (District Prohibition & Excise Officer) బి. ముకుంద రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
ఇంతకుముందు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌తో పాటు జిల్లా మధ్యనిషేధ మరియు అబ్కారీ అధికారి (FAC)గా విధులు నిర్వహించిన బి. హనుమంతరావు పదోన్నతి పొంది మల్కాజ్గిరి జిల్లా మధ్యనిషేధ మరియు అబ్కారీ అధికారిగా బదిలీ అయ్యారు.
వారి స్థానంలో పదోన్నతిపై బదిలీ అయిన బి. ముకుంద్ రెడ్డి 2026 జూన్ 25న కామారెడ్డి జిల్లా మధ్యనిషేధ మరియు అబ్కారీ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా శాఖ అధికారులు, సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.
కొత్త బాధ్యతల్లో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని ముకుంద్ రెడ్డి తెలిపారు.











