సంగారెడ్డి, జూలై 15
జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పటాన్ చెరు సబ్-డివిజనల్ పోలీసు అధికారి కార్యాలయాన్ని సందర్శించి, రికార్డులను, పెండింగ్ కేసులను సమీక్షించారు. బాధితులకు సత్వర న్యాయం అందించాలని, సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డీఎస్పీకి సూచనలు చేశారు.
పటాన్ చెరు సబ్-డివిజనల్ పోలీసు అధికారి కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సందర్శించారు. అనంతరం డీఎస్పీతో కలిసి కార్యాలయ ఆవరణలో మొక్కను నాటారు.
ఈ సందర్భంగా డీఎస్పీ కార్యాలయ రికార్డులను, దర్యాప్తులో ఉన్న గ్రేవ్ కేసులను పరిశీలిస్తూ వివిధ విభాగాల పనితీరును సమీక్షించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, పోక్సో కేసులు, అత్యాచార కేసులు, డౌరీ డెత్ కేసుల్లో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని, ప్రతి కేసులో చట్టపరమైన నిబంధనలను పాటిస్తూ సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని డీఎస్పీకి సూచనలు చేశారు.
పటాన్ చెరు సబ్ డివిజన్ హైదరాబాద్ పరివాహక ప్రాంతం కావడం వలన ఉపాధి కూలీలు, ఉద్యోగుల రాకపోకల కారణంగా అధిక ట్రాఫిక్ సమస్య ఉంటుందని, ఈ ప్రాంతంలో అధిక సంఖ్యలో పరిశ్రమలు ఉండటంతో వలస కార్మికులు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఆస్తి సంబంధిత నేరాలు జరిగే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయని అన్నారు.
వీరి వెంట పటాన్ చెరు డీఎస్పీ ప్రభాకర్, సిబ్బంది ఉన్నారు.











