సంగారెడ్డి, జూలై 14
తెలంగాణపొలిటికల్జేఏసీవినతి రాష్ట్ర సాధన కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఉద్యమకారులకు అధికారిక గుర్తింపు కల్పించాలని, వారి సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించాలని తెలంగాణ గుర్తింపు కమిటీకి తుప్రాన్ డివిజన్ అధ్యక్షుడు కొండాపురం బాలరాజ్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన గుర్తింపు కమిటీ సమావేశంలో ఆయన తెలంగాణ పత్రం సమర్పించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన ప్రతి ఉద్యమకారుడికి అధికారిక గుర్తింపు కల్పించాలని, వారి సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించాలని తెలంగాణ పొలిటికల్ జేఏసీ తుప్రాన్ డివిజన్ అధ్యక్షుడు కొండాపురం బాలరాజ్ గౌడ్ కోరారు.
మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశానికి బాలరాజ్ గౌడ్, నాయకులు పట్నం తనీష, అంచనూరి రాజేష్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులకు వినతి పత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా బాలరాజ్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వేలాది మంది ఉద్యమకారులు తమ సమయాన్ని, శ్రమను, జీవితాన్ని అంకితం చేశారని గుర్తు చేశారు. అయితే ఇప్పటికీ ఎంతో మంది నిజమైన ఉద్యమకారులు ప్రభుత్వ గుర్తింపుకు దూరంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అర్హులైన ప్రతి ఉద్యమకారుడి సేవలను పరిగణనలోకి తీసుకుని పారదర్శకంగా గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సమాన న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, ఉద్యమకారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని వినతి పత్రంలో కోరినట్లు తెలిపారు.
తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుల త్యాగాలను ప్రభుత్వం గౌరవించి, వారికి తగిన గుర్తింపు, సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.











