సంగారెడ్డి, జూలై 23
రాష్ట్ర, జిల్లా స్థాయిలలో పనిచేస్తున్న జర్నలిస్టులకు సంబంధించిన అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, వారి బస్ పాస్‌ల చెల్లుబాటు వ్యవధిని ఆగస్టు 3వ తేదీ వరకు పొడిగిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు టీయూడబ్ల్యూజే-ఐజేయూ జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి వివరాలు వెల్లడించారు.
రాష్ట్ర, జిల్లా స్థాయిలలో పనిచేస్తున్న జర్నలిస్టులకు 2026-2028 సంవత్సరాలకు సంబంధించిన అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని టీయూడబ్ల్యూజే-ఐజేయూ సంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షుడు బండారు యాదగిరి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ, అర్హులైన వారికి కార్డుల జారీ ప్రక్రియ వివిధ దశలలో ఉందని అన్నారు.
ఈ క్రమంలో కోర్టు ఉత్తర్వుల మేరకు అక్రిడిటేషన్ కార్డుల చెల్లుబాటు వ్యవధిని వచ్చే నెల అంటే ఆగస్టు 3వ తేదీ వరకు పొడిగించారని చెప్పారు. దీనికి అనుగుణంగా, పాత రాష్ట్ర, జిల్లా పాత్రికేయుల బస్ పాస్‌లన్నింటి చెల్లుబాటు వ్యవధిని 23.07.2026 నుండి 03.08.2026 వరకు (12) రోజులు పొడిగించారని పేర్కొన్నారు.
ఈ మేరకు జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి, ఆర్టీసీ అధికారులకు ఉత్తర్వులు జారీ అయ్యాయని తెలిపారు. రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని బండారు యాదగిరి తెలియజేశారు.











