నిజామాబాద్, ఆగస్టు 1
నిజామాబాద్ నగర మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో అనుమతుల జారీలో తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయని బిల్డర్లు, బాధితులు ఆరోపిస్తున్నారు. అన్ని అనుమతులు, పత్రాలు సమర్పించినా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తూ, వివిధ కారణాలు చూపి ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు వాపోతున్నారు.
నిజామాబాద్ నగర మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో అనుమతుల జారీ ప్రక్రియలో తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయని బిల్డర్లు, బాధితులు ఆరోపిస్తున్నారు. అన్ని అనుమతులు, అవసరమైన పత్రాలు సమర్పించినప్పటికీ ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తూ, వివిధ కారణాలు చూపి ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు వాపోతున్నారు.
గంగాస్తాన్ ఆర్టీసీ కాలనీలో నిర్మాణం చేపట్టనున్న ఓ బిల్డర్‌కు గత 40 రోజులుగా అనుమతులు మంజూరు చేయకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు సమాచారం. లేఅవుట్ అనుమతులు, రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన లింక్ డాక్యుమెంట్లు, ఎల్ఆర్ఎస్ ఆమోద పత్రాలు, నిర్ణీత రుసుముల చెల్లింపు వివరాలు సమర్పించినప్పటికీ కొత్త కొత్త అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అనుమతులను నిలిపివేస్తున్నారని బాధితుడు ఆరోపిస్తున్నాడు.
ఈ విషయమై ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని, టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది అధికారులు లంచం డిమాండ్ చేస్తున్నారని కూడా బాధితుడు ఆరోపించాడు.
మరోవైపు, నగర మున్సిపల్ కమిషనర్ అశోక్ పారదర్శకంగా, నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్నప్పటికీ, కింది స్థాయి సిబ్బంది వ్యవహారశైలితో ఆయనకు పూర్తి సమాచారం చేరడం లేదని పలువురు పేర్కొంటున్నారు.
నగరంలో జీ+1 అంతస్తుల నిర్మాణానికి మాత్రమే అనుమతులు జారీ చేసిన చోట్ల జీ+3 వరకు నిర్మాణాలు జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవల నగరంలో పర్యటించిన ఉన్నతాధికారుల దృష్టికి ఈ అంశాలు వెళ్లినట్లు సమాచారం.
ఇటీవలి కాలంలో పలు ప్రభుత్వ శాఖల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సోదాలు కొనసాగుతున్నప్పటికీ, టౌన్ ప్లానింగ్ విభాగంలో మాత్రం పరిస్థితిలో మార్పు కనిపించడం లేదని బిల్డర్లు ఆరోపిస్తున్నారు. కొందరు అధికారులు సిండికేట్‌గా వ్యవహరిస్తూ నిర్మాణ అనుమతుల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని అంటున్నారు.
ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం మందగమనంలో ఉండగా, అనుమతుల జాప్యం, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు బిల్డర్లపై అదనపు భారంగా మారాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.












