సంగారెడ్డి, జూలై 31
జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచనల మేరకు సంగారెడ్డి బాల సదన్‌ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.సౌజన్య శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లల సంరక్షణ, క్రమశిక్షణ, పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలపై ఆమె దృష్టి సారించారు.
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల ప్రకారం శుక్రవారం బాల సదన్‌ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.సౌజన్య ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా సౌజన్య మాట్లాడుతూ, పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వారి సంరక్షణకు తోడ్పడాలని, అందరూ క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. వారి బాగోగులను చూడటంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలని ఆమె కోరారు.
విద్యార్థులకు అందించే భోజనాన్ని కూడా ఆమె పరిశీలించారు. చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, ఎవరికైనా న్యాయపరమైన విషయాలలో ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. ఏదైనా న్యాయ సహాయం అవసరమైతే న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.











