సంగారెడ్డి, జూలై 22
పటాన్చెరు పోలీస్ స్టేషన్ నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన రవీందర్‌ను ఇంద్రేశం మున్సిపాలిటీ 4వ వార్డు కౌన్సిలర్ మన్నే లక్ష్మి, 15వ వార్డు కౌన్సిలర్ బుజంగారెడ్డి ఘనంగా సన్మానించారు. బుధవారం సీఐ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
పటాన్చెరు పోలీస్ స్టేషన్ నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన రవీందర్‌ను ఇంద్రేశం మున్సిపాలిటీ 4వ వార్డు కౌన్సిలర్ మన్నే లక్ష్మి, 15వ వార్డు కౌన్సిలర్ బుజంగారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. బుధవారం పటాన్చెరు సీఐ కార్యాలయంలో వారు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్థవంతమైన పోలీసు సేవలు అందించాలని కోరారు. పటాన్చెరు నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించేలా సీఐ రవీందర్ కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తూ, పోలీసు-ప్రజల మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతం కావాలని సూచించారు.
సీఐ రవీందర్ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.
ఈ సమావేశంలో సీనియర్ నాయకులు ఐలాపురం నాగరాజు, పోచారం మాజీ సర్పంచ్ జగన్ తదితరులు పాల్గొన్నారు.












