(ఎస్ఐఆర్) (ప్రశ్న ఆయుధం) జూలై 06
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో భాగంగా ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తి చేసి ఈ నెల 24వ తేదీలోపు సంబంధిత బూత్ లెవెల్ అధికారికి (బీఎల్ఓ) తప్పనిసరిగా అందజేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. గడువులోపు ఫారం సమర్పించని వారి పేర్లు ఆగస్టు 5న ప్రచురించే ముసాయిదా ఓటర్ల జాబితాలో ఉండకపోవచ్చని ఆమె హెచ్చరించారు.

సోమవారం ప్రజావాణి అనంతరం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ, అన్ని శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు సైతం విధిగా ఎన్యూమరేషన్ ఫారాలను నింపి బీఎల్ఓలకు అందజేయాలని ఆదేశించారు. అధికారులు ఏ హోదాలో ఉన్నా ఎన్నికల సంఘం నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.
జిల్లాలో దాదాపు అన్ని ప్రాంతాల్లో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయిందని, ఇప్పుడు వాటిని సరైన వివరాలతో పూరించి గడువులోపు సమర్పించడమే అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఓటర్లలో విస్తృత అవగాహన కల్పించాలని, మండల స్పెషల్ అధికారులు తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించి ఎస్ఐఆర్ అమలు, బీఎల్ఓల పనితీరును పరిశీలించాలని సూచించారు.
ఎస్ఐఆర్ ప్రక్రియపై ఓటర్ల సందేహాలను నివృత్తి చేసి అవసరమైన సహాయం అందించేందుకు కలెక్టరేట్లో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలని ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజ్‌ను ఆదేశించారు.
ఈ సందర్భంగా సంక్షేమ వసతి గృహాలు, ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని మండల ప్రత్యేక అధికారులకు సూచించారు. విద్యాసంస్థల్లో సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి పాముకాటు, విష కీటకాల ప్రమాదాలను నివారించాలని ఆదేశించారు. అంకితభావంతో ఉత్తమంగా విధులు నిర్వహించే మండల ప్రత్యేక అధికారులకు ప్రోత్సాహకాలు అందజేస్తామని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వి. భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ సురేష్, డీఆర్ఓ గీత, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీఆర్డీఓ సాయన్న, డీపీఓ శ్రీనివాస్‌రావు, నిజామాబాద్ ఏసీపీ ప్రకాశ్‌తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.