కామారెడ్డి, 06.07.2026
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన 80 దరఖాస్తులను స్వీకరించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో అర్జీదారుల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు.
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన 80 దరఖాస్తులను స్వీకరించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల సమస్యలను కలెక్టర్ స్వయంగా తెలుసుకున్నారు.
అందిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తూ, వాటిని ప్రాధాన్యతతో పరిశీలించి నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం పెండింగ్ దరఖాస్తులపై ఆరా తీశారు.
తహసీల్దార్ లు, ఆయా శాఖల అధికారులు ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులతో పాటు, ఆయా సంక్షేమ, అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని, ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం ఉండరాదని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, ఎన్.వి. గిరి, పీడీసీ రవితేజ, డీఆర్ఓ పాండు, జడ్పీ సీఈఓ చందర్, జిల్లా స్థాయి అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.












