తెలంగాణ అమరవీరులకు, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను జూన్ 2 లోగా నెరవేర్చాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజు దోపిడీని నియంత్రించాలని, సన్న వడ్లకు బోనస్ ఇవ్వాలని ఆమె కోరారు.
కుత్బుల్లాపూర్ లో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ, పార్టీ చేరికల కార్యక్రమంలో పాల్గొన్న కవిత, ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. కుత్బుల్లాపూర్ లో 20 ఏళ్ల క్రితం నిర్మించిన అమరుల స్థూపాన్ని జూన్ 2 లోగా ఆవిష్కరించాలని, లేదంటే టీఆర్ఎస్ ఆధ్వర్యంలో తామే ఆవిష్కరిస్తామని తెలిపారు.
ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం కాలయాపన చేస్తోందని కవిత విమర్శించారు. జూన్ 2 న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు.
ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల దోపిడీపై వెంటనే చట్టం చేయాలని కవిత కోరారు. ఇదివరకే పలుమార్లు డిమాండ్ చేసినా ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. ఫీజు నియంత్రణ చట్టం జూన్ లో కచ్చితంగా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ స్థానాన్ని గెలుచుకుంటామని కవిత ధీమా వ్యక్తం చేశారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అన్ని డివిజన్లలో పోటీ చేస్తామని చెప్పారు. తెలంగాణ రక్షణ సేన జెండాలోని రంగులు వివిధ వర్గాలను ఎలా సూచిస్తాయో వివరించారు. రైతుల పక్షాన పోరాడుతామని, యువతకు వ్యాపారాల కోసం రుణాలు అందిస్తామని హామీ ఇచ్చారు.











