సంగారెడ్డి, జూలై 3
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.సౌజన్య శుక్రవారం బీరంగూడలోని స్వధార్ హోమ్‌ను తనిఖీ చేశారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు ఈ తనిఖీ జరిగింది. బాధిత మహిళలకు అందిస్తున్న వసతి, ఆహారం, వైద్య సేవలు, భద్రత, కౌన్సెలింగ్ వంటి సౌకర్యాలను ఆమె పరిశీలించారు.
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచనల ప్రకారం, శుక్రవారం బీరంగూడలోని స్వధార్ హోమ్‌ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.సౌజన్య తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా స్వధార్ హోమ్‌లో ఆశ్రయం పొందుతున్న బాధిత మహిళలకు అందిస్తున్న వసతి, ఆహారం, వైద్య సేవలు, భద్రత, పరిశుభ్రత, కౌన్సెలింగ్ మరియు ఇతర సంక్షేమ సౌకర్యాలను ఆమె పరిశీలించారు. బాధిత మహిళలతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి, మానసిక స్థితి, సమస్యలు, అవసరాల గురించి తెలుసుకున్నారు.
వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సేవలు అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అదేవిధంగా, బాధితుల హక్కులను పరిరక్షిస్తూ వారికి అవసరమైన న్యాయ సహాయం, కౌన్సెలింగ్, పునరావాస సేవలను అందించాలన్నారు.
ఎవరికైనా న్యాయ పరమైన విషయాలలో ఉచిత న్యాయ సహాయం అందిస్తామని, ఏదైనా న్యాయ సహాయం కోరినచో న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం సంగారెడ్డిని సంప్రదించాలని తెలిపారు.











