సంగారెడ్డి, జూన్ 30
లయన్స్ డిస్ట్రిక్ట్ 320D లయనిస్టిక్ సంవత్సరానికి "We Serve – Lead to Service" నినాదంతో సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టనున్నట్లు శేరిలింగంపల్లి రీజియన్ చైర్మన్ గుమ్మడిదల వెంకన్న తెలిపారు. విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణతో పాటు సమాజ అభ్యున్నతికి దోహదపడే కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.
విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ రంగాల్లో సేవా కార్యక్రమాల నిర్వహణే తమ ప్రధాన లక్ష్యమని శేరిలింగంపల్లి రీజియన్ చైర్మన్గా నియమితులైన లయన్ గుమ్మడిదల వెంకన్న తెలిపారు. 2026 జూలై 1 నుంచి 2027 జూన్ 30 వరకు కొనసాగే లయన్స్ డిస్ట్రిక్ట్ 320D లయనిస్టిక్ సంవత్సరానికి "We Serve – Lead to Service" అనే నినాదంతో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపడతామని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సేవే పరమావధిగా విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణతో పాటు సమాజ అభ్యున్నతికి దోహదపడే పలు కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు. ఈ లయనిస్టిక్ సంవత్సరానికి లయన్స్ క్లబ్ ఆఫ్ సంగారెడ్డి నుంచి పలువురికి కీలక పదవులు దక్కాయి. శేరిలింగంపల్లి ఐదవ రీజియన్ చైర్మన్గా గుమ్మడిదల వెంకన్న, రీజియన్ కార్యదర్శిగా మంగళపర్తి వెంకటేశం, ఏరియా కోఆర్డినేటర్గా అనంతరావు కులకర్ణి, జోన్ చైర్మన్గా లాడే మల్లేశంలు నియమితులయ్యారు.
లయన్స్ డిస్ట్రిక్ట్ 320Dలో మొత్తం పది రీజియన్లు ఉండగా, ఐదవ రీజియన్ పరిధిలో సంగారెడ్డి, పటాన్ చెరు, అమీన్పూర్, తెల్లాపూర్, శేరిలింగంపల్లి, జూబ్లీ హిల్స్, రామచంద్రాపురం ప్రాంతాలకు చెందిన 16 లయన్స్ క్లబ్లు సేవలందిస్తున్నాయి.
ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన నాయకులను క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శులు, డిస్ట్రిక్ట్ చైర్మన్లు శంకరి విజయేందర్ రెడ్డి, పిల్లిగుండ్ల రాములుగౌడ్, నాయికోటి రామప్ప, డి.హన్మంత్ గౌడ్, ఎం.సునీల్ కుమార్, జార్జ్ మ్యాథ్యూ, పి.రామకృష్ణారెడ్డి తదితరులు అభినందించి, వారి సేవా కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.












