సంగారెడ్డి, జూలై 2
రాయికోడు మండలంలోని నాగ్వార్ గ్రామంలో ఇందిరమ్మ నూతన గృహాలను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి.అంజయ్య, డిసిఎంఎస్ మాజీ చైర్మన్ సిద్ధన్న పాటిల్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాలాజీ నరసింహులు, పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వమని ఈ సందర్భంగా అంజయ్య అన్నారు.
రాయికోడు మండల పరిధిలోని ఇందిరమ్మ ఆదర్శ గ్రామంగా ఎంపికైన నాగ్వార్ గ్రామంలో గురువారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి.అంజయ్య, డిసిఎంఎస్ మాజీ చైర్మన్ సిద్ధన్న పాటిల్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాలాజీ నరసింహులు, పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి ఇందిరమ్మ నూతన గృహాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అంజయ్య మాట్లాడుతూ నాగ్వార్ గ్రామంలో చాలా గొప్పగా ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకోవడం చాలా అభినందనీయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని ఇది చేతల ప్రభుత్వమని గుర్తు చేశారు. ఈ సందర్భంగా అతిథులందరికీ లబ్ధిదారులు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎంఏ షరీఫ్, వీరభద్రేశ్వర దేవాలయ కమిటీ చైర్మన్ సతీష్ కులకర్ణి, మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు బసవరాజ్ పటేల్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కేదార్నాథ్ పాటిల్, వైస్ చైర్మన్ వినయ్ కుమార్, యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఏ ప్రభాకర్, సర్పంచులు గురుదాస్, చరణ్, సీనియర్ నాయకులు మహంకాళి, జ్ఞానేశ్వర్, జి విట్టల్, ఎం శివకుమార్, రాజకుమార్, ప్రవీణ్, పాండు, శ్రీనివాస్, లబ్ధిదారులు దత్తు తదితరులు పాల్గొన్నారు.












