కామారెడ్డి, జూన్ 30, 2026
రోటరీ అంతర్జాతీయ సేవా సంస్థ 2025-26 వార్షిక అవార్డుల కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ప్రతిష్టాత్మక పురస్కారాలను సొంతం చేసుకుంది. సమాజంలోని వివిధ రంగాలలో చేసిన విశేష సేవలకు గాను ఈ క్లబ్‌కు పదికి పైగా ఉత్తమ అవార్డులు లభించాయి. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ రామ్ ప్రసాద్, మాజీ DGP అనురాగ్ శర్మ చేతుల మీదుగా కామారెడ్డి క్లబ్ ప్రతినిధులు అవార్డులను అందుకున్నారు.
రోటరీ అంతర్జాతీయ సేవా సంస్థ 2025-26 సంవత్సరానికి గాను నిర్వహించిన వార్షిక రోటరీ అవార్డ్స్ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకుంది. సమాజంలోని వివిధ రంగాలలో చేసిన విశేష సేవలకు గాను ఈ క్లబ్‌కు పదికి పైగా ఉత్తమ అవార్డులు లభించాయి. హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించిన ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ రామ్ ప్రసాద్ మరియు మాజీ DGP అనురాగ్ శర్మ చేతుల మీదుగా కామారెడ్డి క్లబ్ ప్రతినిధులు ఈ పురస్కారాలను అందుకున్నారు.
ముఖ్యంగా విద్యాసంబంధిత సేవలు, ఉచిత వైద్య శిబిరాలు, పర్యావరణ పరిరక్షణ వంటి సామాజికాంశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి చూపిన చొరవకు ఈ గుర్తింపు దక్కింది.
ఈ సందర్భంగా రోటరీ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సంవత్సరం రోటరీ సభ్యులు అత్యంత ఉత్సాహంతో, ప్రభుత్వ మరియు ఇతర స్వచ్ఛంద సంస్థలు, సభ్యుల సహకారంతో అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం బెంచీల వితరణ, మౌలిక వసతుల కల్పనతో పాటు, ప్రజల ఆరోగ్యం కోసం అత్యంత భారీ స్థాయిలో 'క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షా శిబిరం' నిర్వహించామని గుర్తుచేశారు. ఆసుపత్రులలో రోగులకు అవసరమైన సేవలు అందించడం, పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం వంటి ఎన్నో సేవా కార్యక్రమాల వల్లనే అన్ని క్లబ్‌ల కంటే కామారెడ్డి క్లబ్ ఉత్తమంగా నిలిచిందని ఆయన కొనియాడారు.
ఈ అవార్డుల ప్రధానోత్సవంలో అసిస్టెంట్ గవర్నర్ డా. M. జైపాల్ రెడ్డి, రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ప్రెసిడెంట్ Y. శంకర్, సెక్రెటరీ కృష్ణ హరి, ట్రెజరర్ రమణ మరియు ఇతర ముఖ్య సభ్యులు ధనంజయ, Dr బాలరాజు, సుధాకర్, సంతోష్, భైరయ్య పాల్గొని అవార్డులను స్వీకరించారు. ఈ పురస్కారాలు తమ బాధ్యతను మరింత పెంచాయని, భవిష్యత్తులో మరిన్ని ముమ్మర సేవా కార్యక్రమాలతో సమాజ అభివృద్ధికి తోడ్పడతామని క్లబ్ ప్రతినిధులు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు.












