కామారెడ్డి, 2026-07-02
అఖిల భారత ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIIEA) 76వ స్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి బ్రాంచ్ కార్యాలయంలో పతాకావిష్కరణ జరిగింది. అనంతరం సభ్యులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
మన అఖిల భారత ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIIEA) 76వ స్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి బ్రాంచ్ ఆధ్వర్యంలో పతాకావిష్కరణ, ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. బ్రాంచ్ కార్యాలయం వద్ద AIIEA జెండాను ఎగురవేసిన అనంతరం ఉచిత కంటి పరీక్షలు జరిగాయి.
ఈ స్థాపక దినోత్సవ వేడుకలలో సభ్యులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆప్టికల్ హబ్ డాక్టర్ బాల్ నాయక్, బ్రాంచ్ ICEU అధ్యక్షులు K. నర్సింలు, సెక్రటరీ నాగేశ్వర్ రావు, బ్రాంచ్ మేనేజర్ కృష్ణ మోహన్, శ్రీనివాస్ రావు, అనర్ధన్, విద్య సాగర్, డెవలప్మెంట్ ఆఫీసర్స్ నహిమోద్దీన్, భరత్, సునీల్, వెంకట్ రాజం, విజయ్ కుమార్, యూసుఫ్, నాయకులు కిషోర్ చంద్, నారాయణ రావు, ఏజెంట్ మిత్రులు హాజరయ్యారు.











