సంగారెడ్డి, జూలై 25
పటాన్చెరు పట్టణంలో ఎస్ఐఆర్ (Special Intensive Revision) కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి ప్రిథ్వీరాజ్ ఆధ్వర్యంలో గత 20 రోజులుగా విస్తృత స్థాయిలో సేవా కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. అర్హులైన ఓటర్ల వివరాల నమోదులో సహాయం అందించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం.
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి ప్రిథ్వీరాజ్ నాయకత్వంలో పటాన్చెరు పట్టణంలో ఎస్ఐఆర్ (Special Intensive Revision) కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో గత 20 రోజులుగా విస్తృత స్థాయిలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ప్రతి అర్హత ఉన్న ఓటరు వివరాలు సక్రమంగా నమోదు కావాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా విద్యార్థి వాలంటీర్ల బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరు ఫారమ్‌లను నింపడం, అవసరమైన పత్రాలపై అవగాహన కల్పించడం, నమోదు స్థితిని పరిశీలించడం, సందేహాలకు సమాధానాలు ఇవ్వడం వంటి సేవలను అందించారు. అలాగే బీఎల్ వోలకు అవసరమైన సహకారం అందిస్తూ ఎస్ఐఆర్ ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు తోడ్పాటునందించారు.
శ్రీనగర్, రాంకీ సింఫనీ, సింఫనీ పార్క్ హోమ్స్, ఏపీఆర్ లగ్జరియా, ప్రణీత్ ప్రణవ్ నైట్వుడ్స్, బండ్లగూడ గ్రామపంచాయతీ, శ్రీరామ్‌నగర్ కాలనీ, శాంతినగర్, రాఘవేంద్ర కాలనీ, మంజీరా స్కూల్ పరిసరాలు, గౌతమ్‌నగర్, మున్నూరుకాపు ఫంక్షన్ హాల్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఎండీఆర్ ఫౌండేషన్ ఎస్ఐఆర్ హెల్ప్ డెస్క్‌ల ద్వారా వేలాది మంది ప్రజలు సేవలు పొందారు.
ప్రజలకు ఉపయోగపడే ఈ సేవా కార్యక్రమాలను స్థానికులు, విద్యార్థులు, బీఎల్ వోలు అభినందిస్తూ, ప్రజా ప్రయోజనాల కోసం ఎండీఆర్ ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.
ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు. ప్రతి అర్హ ఓటరు పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా అందరూ సహకరించాలని, ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన ఎలాంటి సహాయం అవసరమైనా ఎండీఆర్ ఫౌండేషన్‌ను సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు.












