సంగారెడ్డి, జూలై 30
సంగారెడ్డి రాజీవ్ పార్క్ ఏర్పాటు, అభివృద్ధిలో నలుగురు ముఖ్యమంత్రుల సహకారం ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన పార్క్ ను సందర్శించి, అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి అనుమతులు మంజూరు చేయగా, సీఎం రోశయ్య శంకుస్థాపన, కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారని తెలిపారు.
సంగారెడ్డి రాజీవ్ పార్క్ ఏర్పాటు, అభివృద్ధిలో నలుగురు ముఖ్యమంత్రుల సహకారం ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. గురువారం ఆయన రాజీవ్ పార్క్ ను సందర్శించి, పార్క్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. పార్క్ మొత్తం కలియ తిరుగుతూ జరుగుతున్న, జరగాల్సిన అభివృద్ధి పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పార్క్ లో నూతనంగా ఏర్పాటు చేసిన వ్యాయామ పరికరాలను స్వయంగా పరిశీలించారు. ఫౌంటెన్ పునరుద్దన పనులను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి రాజీవ్ పార్క్ కు అనుమతులు మంజూరు చేశారన్నారు. అనంతరం సీఎం రోశయ్య శంకుస్థాపన చేయగా, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ కాలంలో రాజీవ్ పార్క్ పూర్తిగా చెడిపోయి నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరుకుందని అన్నారు. తిరిగి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారం తో, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ టీకే శ్రీదేవి సహకారంతో మరో రూ.3 కోట్ల నిధులతో రాజీవ్ పార్క్ ను మొదటి దశగా అభివృద్ధి చేశామని, మరో రూ. 6 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రాజీవ్ పార్క్ ను తిరిగి ప్రారంభిస్తమని వివరించారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, నాయకులు బొంగుల రవి, కూన సంతోష్, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ హఫీజ్, టౌన్ ప్రెసిడెంట్ కిరణ్ గౌడ్, శ్రీహరి, కౌన్సిలర్లు మహేష్, నవాజ్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.












