సంగారెడ్డి, జూలై 18
సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం జోనల్ పోలీసు డ్యూటీ మీట్ ను జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ప్రారంభించారు. ఈ మీట్ లో సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పోలీసు అధికారులు, సిబ్బంది, డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోసల్ టీంలు పాల్గొన్నాయి. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయి మీట్ కు ఎంపిక చేస్తారు.
జిల్లా స్థాయి పోలీసు డ్యూటీ మీట్లో ప్రతిభ కనబరిచిన సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు, సిబ్బంది, డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోసల్ టీమ్‌లకు శనివారం సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన జోనల్ పోలీసు డ్యూటీ మీట్‌ను జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా స్థాయి పోలీసు డ్యూటీ మీట్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయి డ్యూటీ మీట్ కు ఎంపిక చేయడానికి, జోన్-VI (చార్మినార్) లో కమిషనరేట్స్ మినహా సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాకు చెందిన 43-మంది అధికారులు, సిబ్బందికి, డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోసల్ టీంలకు ఈ రోజు జోనల్ స్థాయి డ్యూటీ మీట్ నిర్వహించడం జరిగిందని తెలిపారు.
ఈ జోనల్ డ్యూటి మీట్ నందు ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఆగస్టు మొదటి వారంలో మేడ్చల్ లో నిర్వహించే రాష్ట్ర స్థాయి డ్యూటి మీట్ కు ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు.
ఈ డ్యూటీ మీట్ లో సైంటిఫిక్ ఎవిడెన్స్, నేరం జరిగిన తర్వాత నేరస్థలాన్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి, నేరస్థలం నందు క్లూస్ ఏ విధంగా సేకరించాలి, కంప్యూటర్ పరిజ్ఞానం, మరియు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ పని తీరుపై పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీసీఆర్బీ డియస్పి సురేందర్ రెడ్డి, ఎ.ఆర్.డియస్పి నరేందర్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్స్ రమేష్, యస్.బి ఇన్స్పెక్టర్స్ సదా నాగరాజు, డ్యూటి మీట్ అధికారులు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.









