సంగారెడ్డి, జూలై 18
త్వరలో జరగబోయే టీజీఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందర్భంగా జహీరాబాద్ డిపోలో తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజేఎంయూ) నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో టీజేఎంయూను భారీ మెజార్టీతో గెలిపించాలని ఉద్యోగులను కోరారు.
త్వరలో జరగబోయే టీజీఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందర్భంగా జహీరాబాద్ డిపోలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజేఎంయూ) ను గెలిపించాలని టీజేఎంయూ వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్, టీజేఎంయూ గౌరవ అధ్యక్షుడు, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్ ఆర్టీసీ ఉద్యోగులను కోరారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్టీసీని ఆదుకుంటున్నారని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్ని సమస్యలపై పరిష్కరిస్తున్నారని, మిగిలిన సమస్యలను కూడా పరిష్కరిస్తారని తెలిపారు. జరగబోయే ఆర్టీసీ ఎన్నికల్లో తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టీజేఎంయూ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ పల్లె కృష్ణమూర్తి, సంగారెడ్డి రీజినల్ సెక్రెటరీ అంజయ్య గౌడ్, హైదరాబాద్ సిటీ రీజినల్ సెక్రెటరీ బుల్లెట్ పాండు, జహీరాబాద్ డిపో అధ్యక్షులు జిలాని, డిపో కార్యదర్శి నరసింహ, డిపో వర్కింగ్ ప్రెసిడెంట్ శశికుమార్, వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ అనిల్ కుమార్, ఎంఎస్ రెడ్డి జాయింట్ సెక్రెటరీ, నరేష్ అసిస్టెంట్ సెక్రెటరీలు రాజయ్య గౌడ్, సంయోద్దీన్, పి రాములు ఆర్గనైజ్ సెక్రెటరీ రాజు, పబ్లిసిటీ సెక్రెటరీ ఎండి అశ్వక్, గ్యారేజ్ సెక్రెటరీ శ్రావణ్, ట్రెజరర్ ప్రభాకర్, డెలిగేట్స్ మోయిన్, నవీన్ కుమార్, IS రెడ్డి, సంగారెడ్డి డిపో సెక్రెటరీ విక్రమ్, జాయింట్ సెక్రెటరీ రవీందర్, సలహాదారులు విట్టల్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మధుకర్, డెలిగేట్ ఆంజనేయులు, శ్రీనివాస్ మైనార్టీ అధ్యక్షుడు, మైనార్టీ అధ్యక్షుడు వాహిద్ పాషా, తదితరులు పాల్గొన్నారు.












