నర్సాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపొందిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కౌన్సిలర్లు ఎంపీ రఘునందన్ రావును హైదరాబాద్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
బుధవారం జరిగిన ఈ సమావేశంలో 13వ వార్డు కౌన్సిలర్ బుచ్చేశ్ యాదవ్, 8వ వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్, 11వ వార్డు కౌన్సిలర్ నిరంజన్ దాస్ పాల్గొన్నారు.
ఎంపీ రఘునందన్ రావు నూతన కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలిపి, పట్టణ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శక పాలన అందించాలని ఆయన నొక్కి చెప్పారు.


