Srikakulam/Ranasthalam (ప్రశ్న ఆయుధం) జూలై 08
గాంధారి గ్రామంలో శ్రీమతి అస్మా బేగం నిర్వహిస్తున్న బేకరీ యూనిట్‌ను జిల్లా కలెక్టర్ ఈ రోజు సందర్శించారు. ప్రభుత్వ పథకాలతో స్వయం ఉపాధిలో విజయవంతమైన ఆమెను అభినందించి, ఇతర మహిళలు కూడా ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచించారు.
గాంధారి గ్రామంలోని చిమన్ చావలి మహిళా సంఘం సభ్యురాలు, శ్రీమతి అస్మా బేగం నిర్వహిస్తున్న బేకరీ యూనిట్‌ను జిల్లా కలెక్టర్ ఈ రోజు సందర్శించారు. ఈ సందర్భంగా యూనిట్ నిర్వహణ, ఉత్పత్తి ప్రక్రియ, మార్కెటింగ్ విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు.
ప్రభుత్వ పథకాల సహకారంతో స్వయం ఉపాధిలో విజయవంతంగా ముందుకు సాగుతున్న మహిళా పారిశ్రామికవేత్తను కలెక్టర్ అభినందించారు. ఇతర మహిళలు కూడా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక స్వావలంబన సాధించాలని ఆమె సూచించారు.
శ్రీమతి అస్మా బేగం ఈ బేకరీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి బ్యాంకు రుణం ₹3.00 లక్షలు, స్ట్రీనిధి రుణం ₹1.00 లక్ష, CEF (SVEP) ద్వారా ₹50,000 ఆర్థిక సహాయం పొందారు. మొత్తం ₹4.50 లక్షల సహాయంతో వ్యాపారాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం తనతో పాటు మరో 4 సభ్యులకు జీవనోపాధి కల్పిస్తూ, వారికి నెలకు ₹60,000 వేతనం చెల్లిస్తున్నారు.
ఈ యూనిట్ ద్వారా అన్ని ఖర్చులు పోను, నెలకు సుమారు ₹60,000 నుండి ₹70,000 వరకు నికర లాభం ఆర్జిస్తున్నారు. స్థానికంగా ఉపాధి అవకాశాలను కల్పిస్తూ ఆదర్శ మహిళా పారిశ్రామికవేత్తగా నిలిచారు.
జిల్లాలో మహిళా సంఘాల ద్వారా చేపడుతున్న స్వయం ఉపాధి కార్యక్రమాలు గ్రామీణ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్నాయని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దామోదర్, RDO ప్రభాకర్, DPM సాయిలు, MPDO, MRO, APM, స్త్రీ నిధి RM తదితరులు పాల్గొన్నారు.












