నిజామాబాద్, జూలై 22
నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి నిరసనగా ఢిల్లీలో ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ చేయడాన్ని తెలంగాణ రక్షణ చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. విద్యార్థులపై జరిగిన ఈ చర్య ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆమె పేర్కొన్నారు.

నీట్ పరీక్షను పారదర్శకంగా నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆందోళన చేస్తున్న విద్యార్థులపై దౌర్జన్యానికి పాల్పడటం అత్యంత బాధాకరమని కవిత విమర్శించారు. విద్యార్థినులను రోడ్లపై తరుముతూ లాఠీలతో కొట్టడం దేశ ప్రతిష్ఠను ప్రపంచం ముందు దెబ్బతీసే చర్యగా అభివర్ణించారు.
నీట్ పేపర్ లీకేజీ కారణంగా సుమారు 25 లక్షల మంది విద్యార్థులు నష్టపోయారని, ఈ ఘటనల నేపథ్యంలో 21 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. ఈ పరిణామాలకు బాధ్యులెవరో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
పేపర్ లీకేజీకి పాల్పడిన వారిని గుర్తించి అత్యంత కఠినంగా శిక్షించాలని, మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలని కవిత కోరారు.
విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా నిరాహార దీక్ష చేపట్టిన సోనమ్ వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సమాచారం వెల్లడించాలని ఆమె అన్నారు.
విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీని దేశ ప్రజలు తీవ్రంగా గమనిస్తున్నారని, విద్యార్థులపై విరిగిన ప్రతి లాఠీకి, చిందిన ప్రతి రక్తపు చుక్కకు ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు రూపంలో సమాధానం చెబుతారని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.