నిజామాబాద్, జూలై 15
ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో 100 శాతం రాయితీ కల్పించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) ప్రతినిధులు జిల్లా విద్యాశాఖ అధికారి పి. అశోక్‌ను కోరారు. ఈ మేరకు బుధవారం ఆయనకు వినతిపత్రం సమర్పించారు. సమాజంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న జర్నలిస్టుల కుటుంబాల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ విజ్ఞప్తి చేశారు.
ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో 100 శాతం రాయితీ కల్పించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) ప్రతినిధులు జిల్లా విద్యాశాఖ అధికారి పి. అశోక్‌ను కోరారు. ఈ మేరకు బుధవారం ఆయనకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఫెడరేషన్ నాయకులు మాట్లాడుతూ.. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా జర్నలిస్టులు నిరంతరం సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంతో పాటు, ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు.
అయితే, సమాజంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ, చాలామంది జర్నలిస్టులు తక్కువ వేతనాలతో కుటుంబాలను పోషిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వారి పిల్లలకు ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో పూర్తి ఫీజు రాయితీ కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వినతిపత్రం అందజేసిన వారిలో టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్, జిల్లా కార్యదర్శి రాంచందర్, జిల్లా నాయకులు మధు, అనిత, ప్రవీణ్, అఖిల్, రాజు, కృష్ణ, రాజేందర్, శ్రీకాంత్ గౌడ్, సురేష్, లక్ష్మణ్, ఆనంద్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.











