కామారెడ్డి, జూలై 13
ప్రేమ పేరుతో జరిగే మోసాలు, మైనర్ డ్రైవింగ్, మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా వంటి సామాజిక అంశాలపై విద్యార్థుల్లో చైతన్యం నింపేందుకు బిక్నూర్ పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, బిక్కనూర్లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో పోలీస్ కళాబృందం పాటలు, సందేశాల ద్వారా అవగాహన కల్పించింది.
యువత లక్ష్యంతో ముందుకు సాగాలని, సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని బిక్నూర్ పోలీసులు విద్యార్థులకు సూచించారు. ప్రేమ పేరుతో జరిగే మోసాలు, మైనర్ డ్రైవింగ్, మాదకద్రవ్యాల నిర్మూలన, సైబర్ నేరాలు, మైనర్లపై జరిగే నేరాలు, మానవ అక్రమ రవాణా వంటి సామాజిక అంశాలపై ప్రభుత్వ జూనియర్ కళాశాల, బిక్కనూర్లో సోమవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పోలీస్ కళాబృందం పాటలు, సందేశాల ద్వారా విద్యార్థులను చైతన్యపరిచింది.
కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు బిక్నూర్ ఎస్సై నరేందర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాల టోల్ ఫ్రీ నంబర్ 1930, మాదకద్రవ్యాల సమాచారానికి 1908, షీ టీమ్ నంబర్ 8712686094, అత్యవసర పరిస్థితుల్లో 100/112కు కాల్ చేయాలని సూచించారు.
ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సూచనలు పాటించాలని, అపరిచితులను నమ్మి మోసపోవద్దని విద్యార్థులకు అవగాహన కల్పించారు.
పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ యు. శేషరావు, పీసీలు ప్రభాకర్, సాయిలు పాటలు, సందేశాల ద్వారా విద్యార్థులను ఆకట్టుకున్నారు. మానవ అక్రమ రవాణా నియంత్రణపై పీసీ రాజేందర్ వివరించారు.
కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతిర్మణి రాధాదేవి, కళాశాల మోటివేటర్, ఫిజికల్ డైరెక్టర్ మురళీమోహన్, అధ్యాపక బృందం, హెడ్ కానిస్టేబుల్ రవీందర్, బ్లూ కోట్స్ సభ్యులు, విద్యార్థినులు పాల్గొన్నారు.












