సంగారెడ్డి, జూలై 14
జాతీయ, రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థల ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ (DLSA) ఆధ్వర్యంలో రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో విద్యార్థులకు "న్యాయ బాధ్యతలు మరియు పౌరుల చట్టపరమైన బాధ్యతలు" అనే అంశంపై న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా న్యాయమూర్తి జి.భవాని చంద్ర ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది.
జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు, జిల్లా న్యాయమూర్తి జి.భవాని చంద్ర సూచనల మేరకు సంగారెడ్డి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ (DLSA) ఆధ్వర్యంలో మంగళవారం రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో విద్యార్థులకు "న్యాయ బాధ్యతలు మరియు పౌరుల చట్టపరమైన బాధ్యతలు" అనే అంశంపై న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి సౌజన్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, ప్రతి పౌరుడు తన హక్కులతో పాటు తన చట్టబద్ధమైన బాధ్యతలను కూడా తెలుసుకొని పాటించాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగ విలువలు, చట్టాల పట్ల గౌరవం, సామాజిక బాధ్యత, మహిళల రక్షణ, సైబర్ నేరాల నివారణ, ర్యాగింగ్ నిషేధం, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, ఉచిత న్యాయ సహాయం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
అదేవిధంగా, ఆర్థికంగా బలహీన వర్గాలకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉందని, న్యాయ సహాయం అవసరమైన వారు NALSA టోల్ ఫ్రీ నంబర్ 15100 లేదా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థను సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పటాన్చెరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వినాయక రెడ్డి, గీతం యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.











